![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -132 లో....రామలక్ష్మి, సీతాకాంత్ లు సరదాగా బయటకు సినిమాకి రెడీ అయి కిందకు వస్తారు. ఈ రోజు బయటకు వెళ్లొద్దని శ్రీలత అడ్డుచెప్పుతుంది. ఎందుకని రామలక్ష్మి అడుగగా.. మీకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది కదా.. ఈ రోజు గ్రహణం అందుకే వెళ్లొద్దు అంటున్నానని శ్రీలత అనగానే.. అమ్మ చెప్తుంది కదా వద్దని, ఇంకెప్పుడైనా వెళదాం లే అని సీతాకాంత్ అంటాడు. దాంతో వెళ్లకుండా చేసామని శ్రీలత, శ్రీవల్లి లు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు.
ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు గదిలోకి వెళ్తారు. మీ అమ్మ వద్దని చెప్పిందని సినిమాకి తీసుకెళ్లలేదు. మరి నాకు ఇచ్చిన మాట ఏంటి? నన్ను సినిమాకి తీసుకొని వెళ్తునని అన్నారు. నేను అలిగాను.. మీతో మాట్లాడనని రామలక్ష్మి అంటుంది. ఇప్పుడు నీకు సినిమా చూడాలని ఉంది అంతే కదా అంటూ ఇంట్లో టీవీలో సినిమా వేస్తాడు. రామలక్ష్మి, సీతాకాంత్ లు టీవీ చూస్తుంటే చాటుగా శ్రీవల్లి, శ్రీలతలు చూస్తుంటారు. దాంతో రామలక్ష్మి కావాలనే సీతాకాంత్ భుజాలపై తల వాల్చిపెట్టి ఉంటుంది. వాళ్ళు చూస్తున్నారని తనతో ప్రేమగా ఉంటుంది. అదంతా చూస్తున్న శ్రీవల్లి, శ్రీలతలు కుళ్ళుకుంటారు. మరుసటిరోజు ఉదయం సీతాకాంత్ లేచేసరికి రామలక్ష్మి ఎదరుగా ఉంటుంది. దాంతో సీతాకాంత్ ఆశ్చర్యంగా చూస్తూ.. దేవకన్యలా ఉన్నావంటూ రామలక్ష్మిని పొగుడుతాడు. ఆ తర్వాత బీరువాలోని నగలు రామలక్ష్మి తీసుకొని వస్తుంది. ఆ నగలు వేసుకోమని సీతాకాంత్ అంటాడు. ఇప్పుడు ఎందుకని రామలక్ష్మి అనగానే.. తనే స్వయంగా రామలక్ష్మి మెడలో నగలు వేస్తాడు. ఎంత బాగున్నాయ్ అంటాడు. ఆ తర్వాత శ్రీలత ఫోటోని ఫోన్ లో చూస్తూ.. నా కన్నతల్లి గుర్తుకురాకుండా పెంచింది ఈ తల్లి.. నా ప్రపంచం తనే అని సీతాకాంత్ అంటాడు. మీకు తన నిజస్వరూపం తెలిస్తే తట్టుకోలేరని రామలక్ష్మి అనుకుంటుంది.
ఆ తర్వాత సందీప్ కి అప్పు ఇచ్చిన వ్యక్తి మల్లేష్ .. సందీప్ కోసం ఇంటికి వస్తాడు. సెక్యూరిటీ తో గొడవపడుతుంటే సీతాకాంత్ లోపలికి రమ్మని చెప్తాడు. సందీప్ అప్పు తీసుకున్నట్లు చెప్పబోతుండగా.. అప్పుడే సందీప్ వచ్చి నేను అతనికి అప్పిచ్చాను.. మీరు లోపలికి వెళ్ళండి అని సీతాకాంత్ ని సందీప్ పంపిస్తాడు. ఆ తర్వాత నీ అప్పు ఎలాగైనా తీరుస్తానని మల్లేష్ ని రిక్వెస్ట్ చేస్తాడు సందీప్. ఆ తర్వాత నువ్వు చేస్తుంది ఏం బాలేదు సీతా.. రామలక్ష్మిని బయటకు తీసుకొని వెళ్ళమని చెప్పాను కదా అని పెద్దాయన అనగానే.. అంటే అమ్మ గ్రహణమని వద్దని చెప్పింది. మీ పెళ్లి దైవ నిర్ణయం మిమ్మల్ని.. ఏది ఏం చెయ్యలేదని పెద్దాయన అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |